ఊబిలో దిగబడిన ఇసుకబండి..

ABN , First Publish Date - 2023-02-26T00:20:10+05:30 IST

ఇసుక కోసం తవ్వివది లేసిన గోతి.. ఊబి రూపంలో రెండు మూగజీవాలను బలితీసుకుంది. తానవరంలో ఈ ఘటన శనివారం చోటుచేసు కుంది.

ఊబిలో దిగబడిన ఇసుకబండి..
చనిపోయిన ఎద్దులు

- రెండు ఎద్దులు మృతి

- మునిగిపోతున్న రైతును కాపాడిన స్థానికులు

జామి: ఇసుక కోసం తవ్వివది లేసిన గోతి.. ఊబి రూపంలో రెండు మూగజీవాలను బలితీసుకుంది. తానవరంలో ఈ ఘటన శనివారం చోటుచేసు కుంది. ఉదయం 7గంటల సమయంలో గ్రామానికి చెందిన రైతు శిరికి సూర్య చంద్రరావు రోజులాగే ఇసుక బండిని గ్రామంలో వున్న గోస్తనీ నదిలోకి తీసు కెళ్లాడు. ఈసారి కొత్త స్థలంవైపు బండిని తోలుకెళ్లాడు. లోపల పెద్దపెద్ద గోతులు ఉన్నాయని తెలియక ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతలోనే ఎడ్లు ఒక్కసారిగా మునిగిపోయాయి. వాటితో పాటు రైతు సూర్యచంద్రరావు కూడా ము నిగిపోతుండగా చుట్టుపక్కలవారు పరుగునవచ్చి అతన్ని రక్షించారు. ఎడ్లను రక్షిం చేందుకు ప్రయత్నించినప్పటికీ కొద్దిక్షణాల్లోనే అవి ఊపిరి అందక చనిపోయాయి. చనిపోయిన ఎడ్ల విలువ రూ.లక్షన్నర వరకు ఉంటుందని రైతు తెలిపారు.

Updated Date - 2023-02-26T00:20:11+05:30 IST