ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-06-26T23:44:39+05:30 IST
మధ్యాహ్న భోజనం పథకం (ఎండీఎం) కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమండ్ చేశారు.
సీతంపేట: మధ్యాహ్న భోజనం పథకం (ఎండీఎం) కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు డిమండ్ చేశారు. సోమవారం సీతంపేట మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఎండీఎం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెలా ఐదోతేదీలోగా వేతనాలు చెల్లించాలని, మార్కెట్‌లో పెరుగుతున్న ధరలకు అను గుణంగా మెనూచార్జీలు రూ.20కు పెంచాలని డిమాండ్‌చేశారు. వంటగ్యాస్ ప్రభుత్వ మే సరఫరా చేయాలని, సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంత రం ర్యాలీ నిర్వహించి ఎంఈవో ఆనందరావుకు వినతిప త్రాన్ని అందించారు.