మీటింగ్‌ రద్దయింది.. వివరాలు గుట్టుగా పంపండి

ABN , First Publish Date - 2023-03-09T23:45:59+05:30 IST

మద్యం షాపుల ఉద్యోగులకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల టార్గెట్‌పై ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన ‘ఒకరు ఐదుగురితో.. ఓట్లు వేయించాల్సిందే’ అన్న కథనంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు.

మీటింగ్‌ రద్దయింది..   వివరాలు గుట్టుగా పంపండి

విజయనగరం(ఆంధ్రజ్యోతి) మార్చి 9: మద్యం షాపుల ఉద్యోగులకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల టార్గెట్‌పై ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన ‘ఒకరు ఐదుగురితో.. ఓట్లు వేయించాల్సిందే’ అన్న కథనంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. దీంతో వ్యవహారం సర్దుబాటు చేసుకునేందుకు యత్నిస్తున్నారు. దీనిపై ఖండన ఇవ్వా ల్సిందిగా ఎక్సైజ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించాలంటూ ఎలాంటి టార్గెట్లు విధించలేదని గురువారం ఆశాఖ అధికారులు ఓ ఖండన పంపిం చారు. ఇదిలా ఉండగా ఆంధ్రజ్యోతి కథనంతో ఈనెల 10న శుక్రవారం విజయ నగరంలో జరగాల్సిన మీటింగ్‌ కూడా రద్దు చేసినట్లు తెలిసింది. ఏర్పాట్లు అన్నీ నిలిపి వేయాలంటూ నిర్వాహకులు వైసీపీ ముఖ్యనేతల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. అయితే మద్యం షాపుల ఉద్యోగులకు ఇచ్చిన ప్రొఫార్మాలో మాత్రం తాము గుర్తించిన గ్రాడ్యుయేట్‌ ఓటర్ల వివరాలు, వారి ఫోన్‌ నెంబర్లు పంపాలని, వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందికి సూచించినట్లు తెలిసింది. కాగా వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని సీపీఎం నగర పట్టణ కార్యదర్శి రెడ్డి శంక ర్రావు తెలిపారు. అక్రమ మార్గంలో ఓట్లు వేయించుకుని వైసీపీ పరువు నిలబెటు ్టకోవాలని చూస్తోందన్నారు. ఉద్యోగులను మభ్యపెట్టి, భయపెట్టి ఓట్లు వేయించుకో వాలని చూస్తోందని ఆరోపించారు.

ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు

ఆంధ్రజ్యోతి దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి మద్యనిషేధ, అబ్కారీశాఖ అధికారి వి.సుధీర్‌ స్పందించారు. ఈమేరకు ఒక ప్రకటన పంపించారు. మధ్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటు వేయించాలన్న టార్గెట్లు పెట్టటంగానీ, దానికి సంబంధించిన మెసేజ్‌లుగానీ, మౌఖిక ఆదేశాలు జారీ చేయడంగానీ చేయలేదన్నారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే సిబ్బందితో ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదన్నారు. ఓటర్ల వివరాలు పంపాలని కూడా చెప్పలేదన్నారు.

Updated Date - 2023-03-09T23:45:59+05:30 IST