గిరిజన తండాలో ముసుగుదొంగల హల్‌చల్‌!

ABN , First Publish Date - 2023-09-22T00:11:21+05:30 IST

సాలూరు మండలం తుండ పంచా యతీ పరిధిలో ఉన్న కొడంగివలస గిరిజన తండాలో పోలీసులమని చెప్పి ఇంటి లోకి చొరబడి నలుగురు ముసుగు దొంగలు దోపిడీ చేశారని గిరిపుత్రులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గిరిజన తండాలో ముసుగుదొంగల హల్‌చల్‌!

సాలూరు రూరల్‌, సెప్టెంబరు 21: సాలూరు మండలం తుండ పంచా యతీ పరిధిలో ఉన్న కొడంగివలస గిరిజన తండాలో పోలీసులమని చెప్పి ఇంటి లోకి చొరబడి నలుగురు ముసుగు దొంగలు దోపిడీ చేశారని గిరిపుత్రులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొడంగి వలసలో ఒకవైపు మూడిళ్లు, మరోవైపు నాలుగిళ్లు ఉన్నాయి. ఈ గ్రామంలోకి బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోలీసులమని చెప్పి నలుగురు వ్యక్తులు మూడిళ్ల వైపు వచ్చి తలుపులు బాదారు. గిరిజనులు తలుపులు తీయ డంతో ఇళ్లలోకి వచ్చి పెట్టెలను సోదా చేసి చోడిపల్లి సుకిల ఇంటిలో తులమున్నర బంగారం.. రూ 20 వేలు నగదు, చోడిపల్లి బందురు ఇంటిలో అర తులం బంగా రం.. రూ. 20 వేలు, చోడిపల్లి సన్నమా ఇంటిలో పుస్తెలతాడు, రూ. 50 వేలు దోచు కున్నారని వాపోయారు. వచ్చినవారిలో ఒకరు హెల్మెట్‌ పెట్టుకోగా మరో ముగ్గురు ముసుగులు ధరించి ఉన్నారని, హిందీ, ఒడియా వచ్చీరానట్టు మాట్లాడారన్నారు. ఈ ఘటనపై సాలూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం సాలూరు రూరల్‌ సీఐ ధనంజయరావు, ఎస్‌ఐ ప్రయోగమూర్తి గ్రామాన్ని సంద ర్శించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-09-22T00:11:21+05:30 IST