ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-06-26T23:43:38+05:30 IST
కారాగారంలో ఉన్న ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా జైలు శాఖాధికారి కె.మోహనరావు తెలిపారు.
పాలకొండ: కారాగారంలో ఉన్న ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా జైలు శాఖాధికారి కె.మోహనరావు తెలిపారు. సోమవారం పాలకొండ సబ్‌జైలును అర్థవార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో పరిశీలించారు. ఖైదీలు ఆరోగ్య పరిస్థితిని వారిని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు మెనూ ప్రకారం మంచి పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని జైలు సూపరింటెండెంట్ జి.జోగులుకు సూచించారు. అనంతరం రికార్డులు పరిశీ లించారు. ఈ తనిఖీల్లో జైలు సిబ్బంది చంద్రరావు, మధు, నాగరాజు ఉన్నారు.