బాలుడి అదృశ్యం
ABN , First Publish Date - 2023-06-26T23:46:49+05:30 IST
పట్టణంలోని మెంటిపేట ఎస్సీ కాలనీకి చెందిన పదిహేనేళ్ల బాలుడు అల్ఫిన్‌రాజ్ ఈనెల 25న ఉదయం నుంచి అదృశ్యమైనట్లు రాజాం టౌన్ సీఐ కె.రవికుమార్ తెలిపారు.
రాజాం రూరల్: పట్టణంలోని మెంటిపేట ఎస్సీ కాలనీకి చెందిన పదిహేనేళ్ల బాలుడు అల్ఫిన్‌రాజ్ ఈనెల 25న ఉదయం నుంచి అదృశ్యమైనట్లు రాజాం టౌన్ సీఐ కె.రవికుమార్ తెలిపారు. బంధువుల ఇళ్లల్లో ఆచూకీ లభ్యం కాలేదని పేర్కొన్నారు. తండ్రి జోషఫ్‌రాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. బాలుడి ఆచూకీ లభ్యమైతే రాజాం పొలీస్ స్టేషన్‌కు గానీ 8946053680, 9550980598 నెంబర్లకు సమాచారం అందివ్వాలని ఆయన సూచించారు.