Share News

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2023-11-06T23:42:25+05:30 IST

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని పొలిట్‌ బ్యూరో సభ్యురాలు జి.సంధ్యారాణి అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న సంధ్యారాణి, భంజ్‌దేవ్‌

మెంటాడ: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని పొలిట్‌ బ్యూరో సభ్యురాలు జి.సంధ్యారాణి అన్నారు. సోమవారం అగూరు పంచాయతీ రెల్లిగూడెం ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారంటీ’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి, టీడీపీ నేత భంజ్‌దేవ్‌తో కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా అమె మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. బస్సు యాత్రకు జనాలు లేక మంత్రులు తలలు పట్టుకుంటున్నారని అన్నారు.

టీడీపీలోకి భారీ చేరికలు

చింతలవలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ బవిరెడ్డి కృష్ణ, వార్డు సభ్యులు మొత్తం 30 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆగూరు పంచాయతీ రెళ్లిగూడెంలో సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చలుమూరి వెంకటరావు, గెద్ద అన్నవరం, ముసలి నాయుడు, రెడ్డి ఆదినారాయణ, రెడ్డి సత్యనారాయణ, పల్లి సింహాద్రి, అనిల్‌, కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

కిత్తన్నపేటలో.

లక్కవరపుకోట: చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎస్‌.కోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం ఆమె మండలంలోని కిత్తన్నపేట గ్రామంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆరు పథకాలు వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలు పంచారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా రావాలని ఆమె తెలిపా రు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశానికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కళ్లబొల్లి మాటలు చెప్పి ప్రజాధనాన్ని లూటీచేసిన జగన్మోహ న్‌రెడ్డిని మరోమారు నమ్మరాదని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చొక్కాకుల మల్లునాయుడు, మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, మార్లాపల్లి సర్పంచ్‌ గోగాడ సత్యం, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:42:29+05:30 IST