ఈ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి అధ్వానం
ABN , First Publish Date - 2023-11-21T00:06:19+05:30 IST
మండలంలోని గొల్లపల్లికి వెళ్లే రోడ్డు గోతులు, గుంతలమయం కావడంతో టీడీపీ నాయకుడు పుప్పాల వెంక టరావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాలతో నిరసన తెలిపారు. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా గత రెండు రోజులుగా పాడైపోయిన రోడ్ల వద్ద సెల్ఫీలు తీసుకొని నిరసన తెలుపుతు న్నారు.

రామభద్రపురం (బొబ్బిలి), నవంబరు 20: మండలంలోని గొల్లపల్లికి వెళ్లే రోడ్డు గోతులు, గుంతలమయం కావడంతో టీడీపీ నాయకుడు పుప్పాల వెంక టరావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాలతో నిరసన తెలిపారు. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా గత రెండు రోజులుగా పాడైపోయిన రోడ్ల వద్ద సెల్ఫీలు తీసుకొని నిరసన తెలుపుతు న్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వెంకటరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానం గా తయారైందని, ఈ రోడ్ల గుండా నడవాలంటే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారన్నారు. 4 సంవత్సరాలుగా ఈ రోడ్ల దు స్థితిపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని, దీనివల్ల ప్రమాదాలు జ రుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి గాలికి వదిలేసి నాయకుల లబ్ధికే పాటుపడుతోందని ఆరోపించారు.