రాజకీయ కక్షతో సరుగుడు తోట కాల్చేశారు

ABN , First Publish Date - 2023-03-14T00:13:09+05:30 IST

బంగార్రాజుపేటలోగల తన ఐదెకరాల సరుగుడు తోటను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజకీయ కక్షతో కాల్చి, బూడిద చేశారని కాగితాల సత్యనారాయణరెడ్డి సోమవారం విలేకర్లకు తెలిపారు.

రాజకీయ కక్షతో సరుగుడు తోట కాల్చేశారు

డెంకాడ: బంగార్రాజుపేటలోగల తన ఐదెకరాల సరుగుడు తోటను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజకీయ కక్షతో కాల్చి, బూడిద చేశారని కాగితాల సత్యనారాయణరెడ్డి సోమవారం విలేకర్లకు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ, చాలా కాలం నుంచి తమ కుటుంబం టీడీపీలో కొనసాగుతోందని చెప్పారు. తన భార్య ఎంపీపీగా, తాను ఎంపీటీసీగా, పూసపాటిరేగ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌గా గతంలో పదవులు చేపట్టామని తెలిపారు. గత మూడేళ్లగా కొందరు వ్యక్తులు రాజకీయంగా తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎప్పటికీ లొంగకపోవడంతో ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో తన ఐదెకరాల సరుగుడు తోటను కటింగ్‌ దశలో ఉండగా కాల్చి, బూడిద చేశారని తెలిపారు. మరో పది రోజుల్లో తోటను రూ.15లక్షలకు అమ్మివేస్తున్న తరుణంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, న్యాయం జరిగేవరకు పోరాడుతానని తెలిపారు.

Updated Date - 2023-03-14T00:13:09+05:30 IST