బదిలీల జీవోను సవరించాలి
ABN , First Publish Date - 2023-05-25T23:56:48+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 47 అసంబ ద్ధంగా ఉందని... దీనిని సవరించాలని ఎస్‌టీయూ నాయ కులు జోగారావు డి మాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అమర్ భవనంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కలెక్టరేట్, మే 25: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 47 అసంబ ద్ధంగా ఉందని... దీనిని సవరించాలని ఎస్‌టీయూ నాయ కులు జోగారావు డి మాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అమర్ భవనంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల నమోదుకు కటాఫ్ తేది 2022 ఆగస్టు 31ని తీసుకోవడం సరికాద న్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30ని చివరి పని దినంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా పీఎస్, హెచ్‌ఎం పో స్టులను ఆదే పాఠశాలలో కొన సాగించాలని డిమాండ్ చేశారు. బదిలీలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిర్వహి స్తున్నందున బ్లాక్ చేయకుండా ఖాళీలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.