చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:18 AM
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి, చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి, చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు. శుక్రవారం పార్వతీపురంలోని కేఎంహెచ్ ఆవరణలో జగదీష్ తన అనుచరులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయడం ఎంతో అదృష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో విజ యం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కొత్తగా టీడీపీ కార్యాలయం ప్రా రంభంలో పార్టీ నిబంధనలు పాటించలేదని, సమావేశంలో చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్నారు. టీడీపీ నియో జకవర్గ పరిశీలకుడు గోవిందరాజు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయా లన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి.రవి కుమార్, సీతానగరం మండల పార్టీ అధ్యక్షుడు కొల్లి తిరుపతినాయుడు, కౌన్సిలర్లు గౌరునాయుడు, వెంకటరమణతోపాటు పార్టీ నాయకులు కోలా వెంకటరావు, ప్రదీప్ ఎస్.భాస్కరరావు, ఎం.కార్తీక్, పాలకొండ రాజశేఖర్, డి.మోహన్ పాల్గొన్నారు.