ఆదమరిస్తే అంతే..
ABN , First Publish Date - 2023-06-07T00:00:49+05:30 IST
ఇది అలికాం-బత్తిలి మార్గంలో సింగిడి వద్ద రహదారి. దారి పొడవునా ఇలా భారీ గోతులు ఏర్పడడంతో నిత్యం వాహనదారులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు.
ఇది అలికాం-బత్తిలి మార్గంలో సింగిడి వద్ద రహదారి. దారి పొడవునా ఇలా భారీ గోతులు ఏర్పడడంతో నిత్యం వాహనదారులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాస్తవంగా కొత్తూరు నుంచి పసుకుడి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతులు చేపట్టారు. అయితే కేవలం మూడు కిలోమీటర్ల మేర అలికాం-బత్తిలి మార్గంలో పనులు చేపట్టలేదు. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడే ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.
-భామిని