Share News

లబ్ధిదారులకు టీడ్కో ఇళ్లు పంపిణీచేయాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:43 PM

సోనియానగర్‌, సారిపల్లిలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు తక్షణమే అందజేయాలని బీజెపీ అధికార ప్రతినిధి భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి డిమాండ్‌చేశారు. ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో భూ, ఇసుక మాఫియా విధ్వంసక సంఘటనలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచే శారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని న్యాయం చేయాలని స్టేషన్‌కు వెళ్తే ఫిర్యాదు ఇచ్చిన వారిపైనే పోలీసులు కేసులు పెడు తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్‌మాన్‌ భారత్‌ పథకం కిందప్రతి కుటుంబానికి ఏడాదికి రూ ఐదు లక్షలు ఉచితంగా ఆరోగ్య సేవల కోసం ఇస్తుంటే రాష్ట్రంలె అమలు కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు.

లబ్ధిదారులకు టీడ్కో ఇళ్లు పంపిణీచేయాలి

విజయనగరం దాసన్నపేట: సోనియానగర్‌, సారిపల్లిలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు తక్షణమే అందజేయాలని బీజెపీ అధికార ప్రతినిధి భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి డిమాండ్‌చేశారు. ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో భూ, ఇసుక మాఫియా విధ్వంసక సంఘటనలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచే శారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని న్యాయం చేయాలని స్టేషన్‌కు వెళ్తే ఫిర్యాదు ఇచ్చిన వారిపైనే పోలీసులు కేసులు పెడు తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్‌మాన్‌ భారత్‌ పథకం కిందప్రతి కుటుంబానికి ఏడాదికి రూ ఐదు లక్షలు ఉచితంగా ఆరోగ్య సేవల కోసం ఇస్తుంటే రాష్ట్రంలె అమలు కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆరోగ్య శ్రీ పఽథకాన్ని హైలేట్‌ చేసి ఓట్లు అడగాలని మంత్రిమండలి సమావేశంలో తీర్మానించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు పి.అశోక్‌, రామకృష్ణరాజు, సుధీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:43 PM