చీకటి జీవో రద్దుతో టీడీపీ సంబరం
ABN , First Publish Date - 2023-05-13T00:12:37+05:30 IST
ప్రతిపక్షాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకు న్నారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు.
విజయనగరం రూరల్, మే 12: ప్రతిపక్షాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకు న్నారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 1 ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి, సంస్థ, రాజకీయ పార్టీ అయినా తమ హక్కులు, సమస్యల కోసం ఉద్యమించవచ్చునన్నారు. అటువంటి సందర్భాలో ముఖ్యకూడళ్లు, రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరసన కార్యక్రమాలు చేసుకునే వీలుందన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు ప్రభుత్వంపై రాజీలేని పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. వీరిని కట్టడి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జీవో నెంబర్ 1ని తెచ్చిందన్నారు. ఈ జీవోని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య విజయమని తెలిపారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, రాజేష్‌వర్మ, కర్రోతు నర్సింగరావు, కోండ్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.