Share News

భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:50 PM

విజయనగరంలోని శిల్పారామానికి ఆనుకుని దేవదాయశాఖకు చెందిన నీలయమ్మ సత్రం భూములు కబ్జాకు గురవుతుండడంతో ఆక్రమణలపై చర్యలుతీసుకోవాలని నియోజకవర్గం టీడీపీనాయకులు ఐవీపీరాజు, పి.వరప్రసా ద్‌, కనకలమురళీమోహన్‌, ఎం.పైడిరాజు కోరారు.

భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోండి

కలెక్టరేట్‌: విజయనగరంలోని శిల్పారామానికి ఆనుకుని దేవదాయశాఖకు చెందిన నీలయమ్మ సత్రం భూములు కబ్జాకు గురవుతుండడంతో ఆక్రమణలపై చర్యలుతీసుకోవాలని నియోజకవర్గం టీడీపీనాయకులు ఐవీపీరాజు, పి.వరప్రసా ద్‌, కనకలమురళీమోహన్‌, ఎం.పైడిరాజు కోరారు. ఈమేరకు సోమవారం జగనన్న కు చెబుదాంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. నల్లచెరువుగా గుర్తించిన సర్వేనెంబరు 366 ప్రభుత్వ రికార్డుల ప్రకారం దేవదాయశాఖకు చెందిన భూమిగా ఉందని, అధి కారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినా కొందరు చదునుచేసి ప్లాట్లుగా విభజించుకుని ఆక్రమిస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారులు ఆక్రమ ణలపై విచారణ చేసి చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరారు. ఫ ధాన్యం కొనుగోలు చేయాలని జనసేన పార్టీ నాయకులు వి.శంకరరావు, వై.సం తోష్‌ కోరారు. ఈమేరకు జగనన్నకు చెబుదాంలో వినతిపత్రం అందజేశారు. గుర్ల మండలంలోని భూపాలపురం, నడుపూరు, ఆనందపురం తదితర గ్రామాల్లో ధాన్యం కళ్లాల్లో ఉన్నాయని తెలిపారు. కొన్ని చోట్ల సేకరించిన సమయంలో 100 కేజీలు బస్తాకు అదనంగా ఎనిమిది8 కేజీలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గుర్ల మండలం భూపాలపురంలోని సీసీ రోడ్లకు కాలువులు నిర్మించాలని కోరారు.

Updated Date - Dec 18 , 2023 | 11:50 PM