అనుమానాస్పదంగా గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-04-03T23:50:17+05:30 IST
అనుమానాస్పదంగా గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుందని పెదమానాపురం ఎస్‌ఐ జి.శిరీష తెలిపారు.
దత్తిరాజేరు: అనుమానాస్పదంగా గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుందని పెదమానాపురం ఎస్‌ఐ జి.శిరీష తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. పెదమానాపురం గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వాసవి కల్యాణమండపం వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న వ్యక్తిని స్థానికు లు గుర్తించారు. 108కు సమాచారం అందజేసి, గజపతినగరం పీహెచ్‌సీకి తర లించారు. అయితే ఆ వ్యక్తి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతిచెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉండవచ్చని ఎస్‌ఐ చెప్పారు. స్థానిక రెవెన్యూ అధికారి కూర్మారా వు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు.