రామతీర్థం జూనియర్‌ అసిస్టెంట్‌ సరెండర్‌

ABN , First Publish Date - 2023-05-26T00:03:01+05:30 IST

రామతీర్థం దేవస్థానంలో ఓ ఉద్యోగిని దేవస్థానం ఈవో బీహెచ్‌వీఎస్‌ఎన్‌ కిషోర్‌కుమార్‌ ఆ శాఖ ఉన్నతాధికారులకు సరెండర్‌ చేయడం స్థానికంగా చర్చనీయాంశమయ్యింది.

రామతీర్థం జూనియర్‌ అసిస్టెంట్‌ సరెండర్‌

నెల్లిమర్ల: రామతీర్థం దేవస్థానంలో ఓ ఉద్యోగిని దేవస్థానం ఈవో బీహెచ్‌వీఎస్‌ఎన్‌ కిషోర్‌కుమార్‌ ఆ శాఖ ఉన్నతాధికారులకు సరెండర్‌ చేయడం స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. గత ఏడాది జూలై నెలలో విజయనగరం మాన్సాస్‌ నుంచి బదిలీపై వచ్చిన అట్టాడ శ్రీనివాసరావు అనే జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి ఉద్యోగిని ఈవో ఈనెల 9వ తేదీన ఆకస్మికంగా రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను ఆయనకు వెంటనే ఇవ్వకుండా మరో తొమ్మిది రోజుల తర్వాత ఈనెల 18వ తేదీన ఇచ్చారు. అయితే శ్రీనివాసరావు 18వ తేదీ వరకు దేవస్థానంలోనే విధులు నిర్వర్తించినా ఆ తొమ్మిది రోజులూ హాజరు వేయకుండా నిలిపి వేసి, ఆ ఉత్తర్వులను ఆలస్యంగా ఇవ్వడం వల్ల సర్వీసు పరంగా ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సహోద్యోగులతో సఖ్యత లేదు, ప్రవర్తన బాగోలేదు, విఽధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం, అధికారుల పట్ల ఎదురు తిరుగుతున్నాడనే కారణాలు తప్పితే ఫలానా సంఘటనకు బాధ్యుడు అనే స్పష్టమైన కారణాలు ఏవీ చూపించలేదని తెలుస్తోంది.

Updated Date - 2023-05-26T00:03:01+05:30 IST