రైతులను ఆదుకోండి
ABN , First Publish Date - 2023-11-06T00:16:52+05:30 IST
వర్షాభా వం వల్ల ఈ ఏడాది రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన, టీడీపీ నాయకులు గురాన అయ్యలు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు డిమాండ్ చేశారు.
విజయనగరం దాసన్నపేట/విజయనగరం రూరల్: వర్షాభా వం వల్ల ఈ ఏడాది రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన, టీడీపీ నాయకులు గురాన అయ్యలు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని కోరుకొండ గ్రామంలో రైతు గర్జన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. రాష్ట్రంలో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు వున్నాయని నివేదిక ఇస్తే కేవలం 133 మండలాలను మొక్కుబడిగా ప్రకటించడం రైతులను వంచించడం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, వేచలపు శ్రీను, పి రాజేష్ వర్మ, జనసేన నేతలు ఆశ్విని, గాయిత్రీ, రవితేజ, పవన్‌కుమార్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
తెర్లాం: వరిపంటకు సకాలంలో సాగునీరు అందకపోవడంతో దాదాపు వందల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి అన్నారు. ఆదివారం మండలంలోని సోమిదివలస గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరుతో కలిసి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు లేక వరి పండించే రైతులు కష్టాలు పడు తుంటే వైసీపీ నాయకులు బస్సు యాత్ర చేస్తున్నారన్నారు. వరిపంట కుదే లైన రైతులకు నష్టపరిహారాం అందజేయాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు చందక ఉమ, జనసేన సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటనాయుడు, మాజీ ఎంపీపీ నర్సుపల్లి వెంక టేష్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, రామభద్రపురం మం డల అధ్యక్షుడు భవిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
గంట్యాడ: వర్షభావంతో వరి పంటకు పూర్తిగా నష్టం వచ్చిందని, దీంతో రైతులు రోడ్డున పడ్డారని వెంటనే గజపతినగరం నియోజకవర్గంలోని అన్ని మండలాలను ప్రకటించాలని తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బుడతనాపల్లి గ్రామంలో రైతు గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎండిన వరి పొలాలను పరిశీలించి, ప్రభుత్వ తీరుకు వ్యతిరే కంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో వరి పంట పూర్తిగా ఎండిపోయిం దని, రైతు పెట్టిన పెట్టుబడి బూడిద పాలయ్యిందన్నారు. ఈ పరిస్థితిలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉందన్నారు. ఎండిన పంటలను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పంట నష్టం పోవడంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరో పించారు. వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జనసేన నాయకుడు మర్రాపు సురేష్ మాట్లాడుతూ ఎకరానికి రూ.50వేలు చొప్పున రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండపల్లి భాస్కర్‌నాయుడు, బాలాజీ, చాణక్య, చైతన్య బాబు, జనసేన నాయుకులు ఆదాడ మోహనరావు, ఎం.రవికుమార్, అప్పల రాజు, ఎర్ని నాయుడు తదితరులు ఉన్నారు.
గుర్ల: జిల్లాలో వర్షాలు లేక వరిపండించే రైతులు కష్టాలు పడుతుంటే వైసీపీ నాయకులు బస్సు యాత్ర చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున అన్నారు. ఆదివారం పున్నపు రెడ్డిపేట గ్రామంలో ఎండిపోయిన వరి పొలాల్లో ఆయన పర్యటించారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సన్యాసినాయుడు, పార్టీ అధ్యక్షులు సీహెచ్ మహే శ్వరరావు, జనసేన నాయకులు రమేష్‌రాజు, తుమ్మగంటి సూరినాయుడు, విసనగిరి శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, కృష్ణ, నాగులపల్లి నారాయణరావు, పీఆర్ పేట గ్రామ రైతులు, వివిధ ప్రాంతాల టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: మల్యాడ గ్రామంలో ఆదివారం జనసేన ఆధ్వర్యంలో రైతు గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు లోకం మాధవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. అనంతరం మల్యాడ నుంచి రామతీర్ధం మీదుగా ర్యాలీ నిర్వహించారు. రామతీర్ధంలో బీడు భూములను పరిశీ లించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన ప్రతినిధులు పాల్గొన్నారు.
వేపాడ: మండలంలోని కరకవలసలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో రైతుగర్జన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం లో ఎండిపోయిన వరిపంటను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, జనసేన నాయకులు ఒబ్బిన సత్యనారాయణ, సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడు తూ ఐదుమండలాల్లో కరువు ఏర్పడిందని ప్రభుత్వం వెంటనే పరిశీలనచేసి రైతులకు పరిహారం అందించాలని కోరారు. గోరపల్లి రాము, గుమ్మడి భార తి, లోకాబి రామకోటి, వర్మరాజు, డేగల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.