సిమెంట్ సరఫరా చేయండి
ABN , First Publish Date - 2023-05-26T00:04:50+05:30 IST
జిల్లాలో నాడు-నేడు పనులకు సిమెంట్ సరఫరా చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ కోరారు.

పార్వతీపురం, మే25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాడు-నేడు పనులకు సిమెంట్ సరఫరా చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నాడు-నేడు పనులకు తక్షణం 2,300 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరమని చెప్పారు. మొత్తం 4,500 మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరా చేయా లన్నారు. జిల్లాలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి గదుల ఆధునికీకరణ పనులు నిలిపివేస్తూ ఏపీఎంఎస్‌ఐడీసీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పనులు మధ్యలో ఉన్నాయని, దానిపై పునరాలోచించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి జేసీ విష్ణుచరణ్, డీఆర్వో జె.వెంకటరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు.