విద్యార్థులు నూతనంగా ఆలోచించాలి
ABN , First Publish Date - 2023-03-02T00:00:19+05:30 IST
నేటి విద్యార్థులు రేపటి తరాలకు వారధులుగా నిల వాలని, తమ మెదడులో ఉన్న నూతన ఆలోచనలకు పదునుపెట్టి పెద్దపెద్ద శాస్త్రవేత్తలుగా ఎదగాలని శృంగవరపుకోట మున్సిఫ్ జూనియర్ సివిల్‌కోర్టు న్యాయ మూర్తి సబ్బవరపు వాణీ విద్యార్థులకు పిలుపునిచ్చారు
శృంగవరపుకోట రూర ల్: నేటి విద్యార్థులు రేపటి తరాలకు వారధులుగా నిల వాలని, తమ మెదడులో ఉన్న నూతన ఆలోచనలకు పదునుపెట్టి పెద్దపెద్ద శాస్త్రవేత్తలుగా ఎదగాలని శృంగవరపుకోట మున్సిఫ్ జూనియర్ సివిల్‌కోర్టు న్యాయ మూర్తి సబ్బవరపు వాణీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని భవానీనగర్ డాక్టర్ వరలక్ష్మి సీబీఎస్సీ పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో సీవీ రామన్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం న్యాయమూర్తి వాణి మాట్లాడుతూ విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని సద్విని యోగం చేసుకుని నూతన ఆవిష్కరణలు చేయాలనీ, తద్వారా దేశ ఉన్నతికి శ్రమించాలని కోరారు. ఎంఈవో సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు రూపొం దించిన ఆవిష్కరణలు చూస్తుంటే తనకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని, దీనిలో ఉపా ధ్యాయుల కృషి కనిపిస్తోందన్నారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన 64 సైన్స్ ప్రాజెక్ట్‌లను న్యాయమూర్తి పరిశీలించారు. కిల్తంపాలెం నవోదయ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్, ఎస్.కోటకు చెందిన రాజబాబు మాస్టారు, ఎస్.కోట కోర్టు న్యాయ వా దులు గార్లపాటి అనురాధ, డబ్ల్యూఎన్‌శర్మ, ప్రిన్సిపాల్ రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ, డాక్టర్ భార్గవ్‌రామ్ తదితరులు ఉన్నారు.