రాజ్యాంగపరమైన పాలన కోసం పోరాటం
ABN , First Publish Date - 2023-06-26T23:55:05+05:30 IST
దళిత, బలహీన వర్గాల ప్రజలు డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ నిర్మించిన రాజ్యాంగపర మైన పాలన కోసం పోరాడా లని బీఏసీ కార్యవర్గ సభ్యులు సోము రాంబాబు పిలుపు నిచ్చారు.
దాసన్నపేట, జూన్ 26: దళిత, బలహీన వర్గాల ప్రజలు డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ నిర్మించిన రాజ్యాంగపర మైన పాలన కోసం పోరాడా లని బీఏసీ కార్యవర్గ సభ్యులు సోము రాంబాబు పిలుపు నిచ్చారు. సోమవారం కంటో న్మెంట్‌లో ఉన్న జిల్లా కార్యాల యంలో సాహూ మహరాజ్ 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడు తూ సాహూ మహరాజ్ రాజ్యాంగ వ్యవస్థకు స్ఫూర్తినిచ్చారన్నారు. ఈ నెల 28 న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ పరిధిలోని కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కొమ్ము సోములు, శివప్రసాద్, కారు గౌరి, ఆర్‌జె రెడ్డి, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.