గాడితప్పిన చెత్త నిర్వహణ

ABN , First Publish Date - 2023-06-02T23:51:51+05:30 IST

: రాజాం మునిసిపాలిటీలో చెత్త నిర్వహణ గాడితప్పింది. ప్రధా నంగా సేకరిస్తున్న చెత్త డంపింగ్‌ యార్డుకు తరలించడం లేదు. ఎక్కడికక్కడే పోగుచేస్తుండడంతో కొందరు ఆకతాయులు జనావాసాల్లోనే నిప్పంటు స్తుండడం వల్ల ప్రజల అవస్థలకు గురవుతున్నారు. చెత్తను తరచూ తగల బెడుతున్న విషయం అధికారులకు తెలిసినా చోద్యం చూస్తున్నారని పలువు రు ఆరోపిస్తున్నారు.

 గాడితప్పిన చెత్త నిర్వహణ
పొనుగుటివలసలో చెత్తకు నిప్పు పెట్టిన దృశ్యం

రాజాం: రాజాం మునిసిపాలిటీలో చెత్త నిర్వహణ గాడితప్పింది. ప్రధా నంగా సేకరిస్తున్న చెత్త డంపింగ్‌ యార్డుకు తరలించడం లేదు. ఎక్కడికక్కడే పోగుచేస్తుండడంతో కొందరు ఆకతాయులు జనావాసాల్లోనే నిప్పంటు స్తుండడం వల్ల ప్రజల అవస్థలకు గురవుతున్నారు. చెత్తను తరచూ తగల బెడుతున్న విషయం అధికారులకు తెలిసినా చోద్యం చూస్తున్నారని పలువు రు ఆరోపిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

ఫ మునిసిపాలిటీ పరిధిలోని పొనుగుటివలసలో సేకరిస్తున్న చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించకుండా గ్రామ సమీపంలో ఉన్న చెరువుగట్టుపై వేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆకతాయులు ఆ చెత్తకు మంటలను పెట్టి తగలుబెడుతున్నారు. ఫ వస్త్రపురికాలనీలో మధ్యలో ఉన్న వారు, స్థానికులు ఓ బావి వద్ద చెత్తను పోగు చేస్తున్నారు. ఇక్కడ కూడా చెత్తను కాల్చడంతో పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నామని పలువురు వాపోతున్నారు. ఫ మునిసిపా లిటీ పరిధిలో చెత్త నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది. వాస్తవానికి కమిషనర్‌, అధికారుల వార్డుల్లో పర్యటించి చెత్త ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాల్సిఉంది. అయితే ఏఒక్క అధికారి వార్డుల్లో పర్యటించడంలేదని, వార్డు ల్లో చెత్త సమ స్యపై మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లి చెప్పుకో వల్సి వస్తోం దని పలువురు చెబుతున్నారు. ఫ మునిసిపాలిటీలో నిర్వ హణ లోపం వల్ల పారిశుధ్యం లోపిస్తోంది. దీంతో చెత్త పేరు కుపోతుండడంతో కుళ్లడం వల్ల దుర్వాసన వెలువడుతోం దని, వార్డుల్లో చెత్త పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ తొలగిం చడంలేదని పలువురు వాపోతున్నారు. చెత్తకు మంట పెడు తుండడంపై ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని పారిశుధ్య కార్మికులు చెబుతున్నారని శ్రీకాకుళం రోడ్డు, సంతకవిటి రోడ్డు వాసులు ఆరోపిస్తున్నారు.

ప్రజా యాప్‌ తొలగింపు..

గతంలో ప్రజాయాప్‌ ద్వారా సమస్యలపై ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించే వారు. అయితే ఆ యాప్‌ పూర్తిగా తొలగించారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్ని ఫిర్యాదులొచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారో ఉన్నతాధికారులకు సమాచారం ఉండేది. అయితే పూర్తిగా ఆ యాప్‌ను తొలగించడంతో సమస్యపై మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయల్సి వస్తోంది. అధికారులకు నేరుగా ఫిర్యాదు చేసినా నెలలు తరబడి చర్యలు తీసకోకపోవడంతో ప్రజలు కూడా ఫిర్యాదులు చేయడానికి ఎవరు ముందుకురావడంలేదు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు తీసకొని ప్రజాయాప్‌ అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం..

పలు వార్డుల్లో పట్టణానికి దూరంగా చెత్త తగల బెడుతున్నారన్న విషయంతో తనదృష్టికి వచ్చిందని రాజాం మునిసిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. పరిశీలించి ఆయా ప్రాంతాల కాలనీ వాసులకు హెచ్చరించినట్లు చెప్పారు. వస్త్రపురికాలనీలో వీధి మధ్యలో చెత్తను వేస్తున్న విషయంలో తానే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Updated Date - 2023-06-02T23:51:51+05:30 IST