విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకండి
ABN , First Publish Date - 2023-03-05T03:52:51+05:30 IST
విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకండి. రాజధానిగా అమరావతిని కొనసాగించండి. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయండి.
ఏపీ అభివృద్ధి అధ్యయన వేదిక సభలో నేతలు
విజయవాడ, మార్చి 4: ‘విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకండి. రాజధానిగా అమరావతిని కొనసాగించండి. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయండి. ఇకనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లండి’ అని ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక’ ప్రారంభోత్సవ సభలో వక్తలు సూచించారు. శనివారం గాంధీనగర్‌లో జరిగిన సభలో మాజీ ఐఏఎస్ టి.గోపాలరావు మాట్లాడుతూ ‘గతంలో చంద్రబాబు ప్రారంభించిన అభివృద్ధి పనులను తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి కొనసాగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటిపరిస్థితి లేదు.’ అని అన్నారు. అనంతరం వేదిక కొత్త కమిటీని ఎన్నుకున్నారు.