బ్లాస్టింగ్‌ను నిలిపివేయండి

ABN , First Publish Date - 2023-03-26T00:15:18+05:30 IST

కోటిపాం గ్రామ సమీపంలో రైల్వే మూడోలైన్‌ పనుల్లో భాగంగా అడ్డంగా ఉన్న కొండను తొలగించడానికి సంబంధిత రైల్వే కాం ట్రాక్టర్‌బాంబులతో బ్లాస్టింగ్‌ చేస్తుండడంపై గ్రామస్థులు నిరసన తెలిపారు.

బ్లాస్టింగ్‌ను నిలిపివేయండి

కొమరాడ: కోటిపాం గ్రామ సమీపంలో రైల్వే మూడోలైన్‌ పనుల్లో భాగంగా అడ్డంగా ఉన్న కొండను తొలగించడానికి సంబంధిత రైల్వే కాం ట్రాక్టర్‌బాంబులతో బ్లాస్టింగ్‌ చేస్తుండడంపై గ్రామస్థులు నిరసన తెలిపారు. తక్షణమే నిలిపివేయాలని శనవారం బ్లాసింగ్‌ పనులు అడ్డుకున్నారు. కొండపై ఉన్న శ్రీవీర వెంకట సత్యనారాయ ణ ఆలయం బీటలు వారి కూలిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు. బాంబులతో బ్లాస్టింగ్‌ చేయకుండా రాతిని తొలగించి ఆలయాన్ని కాపాడాలని కోరారు. దీంతో సంబంధిత సిబ్బంది పనులు నిలిపివేశారు.

Updated Date - 2023-03-26T00:15:18+05:30 IST