వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి
ABN , First Publish Date - 2023-11-06T23:30:22+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని టీడీపీ గజపతినగరం నియోజకవర్గం ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు.
దత్తిరాజేరు: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని టీడీపీ గజపతినగరం నియోజకవర్గం ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు. సోమవారం ఎం.లింగాలవలస, గడసాం గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్య త్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన హామీలు, ప్రజలకు కలిగే లాభాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పెద్దింటి మోహన్, మాజీ జడ్పీటీసీ బండారు బాలాజీ, పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి మజ్జి మహేష్, సీనియర్ నాయకులు గుషడి జగన్నాఽథం, జగన్ తదితరులు పాల్గొన్నారు.