Share News

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:17 AM

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.

శృంగవరపుకోట రూరల్‌: బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో అధికార పార్టీలో భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం రాత్రి దెప్పూరు గిరిజన గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తారో వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జీఎస్‌ నాయుడు, అల్లూరి సత్తిబాబురాజు తదితరులు పాల్గొన్నారు.

చీపురుపల్లి: పట్టణంలో ఆదివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని 143, 144 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గవిడి నాగరాజు, శన పతి శంకర్‌, కోల రాకేష్‌, పిన్నింటి వివేక్‌, కోల రాము, సూరిబాబు పాల్గొన్నారు.

రామభద్రపురం: రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందని టీడీపీ నాయకు లు కూనిశెట్టి భాస్కరరావు, అడపా అప్పలకొండ అన్నారు. ఆరికతోట గ్రామంలో ఆదివారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా విఫలం చెందిందని ఆరోపించారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ జాగాన జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం రూరల్‌: విజయనగరం మండలంలో జరుగుతున్న ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొద్దల నర్సింగరావు పిలుపునిచ్చా రు. ఆదివారం కొండకరకాం గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి గ్రామ పరిధిలోని పలు ఇళ్లకు వెళ్లారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలు అమలు చేస్తారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండ్రంకి గౌరీనాయుడు, రాంబాబు, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:17 AM