సిబ్బంది పనితీరు మారాలి

ABN , First Publish Date - 2023-03-26T00:19:13+05:30 IST

రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది పనితీరు మారకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి రమణకుమారి సిబ్బందిని హెచ్చరించారు. అరసాడ ప్రాథమిక సబ్‌ సెంటర్‌తో పాటు పీహెచ్‌సీని ఆమె శనివారం తనిఖీ చేశారు.

సిబ్బంది పనితీరు మారాలి
వైద్య సిబ్బందితో రమణకుమారి

డీఎంఅండ్‌హెచ్‌వో రమణకుమారి

వంగర, మార్చి 25: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది పనితీరు మారకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి రమణకుమారి సిబ్బందిని హెచ్చరించారు. అరసాడ ప్రాథమిక సబ్‌ సెంటర్‌తో పాటు పీహెచ్‌సీని ఆమె శనివారం తనిఖీ చేశారు. ముందుగా రికార్డులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలను సమగ్రంగా నమోదు చేయడం లేదన్నారు. వాటిని వెంటనే సరిచేయాలని ఆదేశించారు. వైద్య సేవలపై ఫిర్యాదు అందితే చర్యలకు వెనుకాడబోమన్నారు. మందుల గదిలోకి వెళ్లి స్టాకును కూడా పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బంది పని గంటలపై తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని, పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. అరసాడలో మరో పీహెచ్‌సీ ఏర్పాటు విషయం ప్రస్తావించగా ఏప్రిల్‌ నుంచి సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమె తెలిపారు.

Updated Date - 2023-03-26T00:19:13+05:30 IST