Share News

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కోలాటం

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:30 AM

జిల్లాకేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం నుంచి స్థానిక సౌందర్య రోడ్డు వరకు కోలాటం ప్రదర్శనతో భారీ ర్యాలీ చేశారు.

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కోలాటం
కోలాటం చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

బెలగాం, డిసెంబరు 30: జిల్లాకేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం నుంచి స్థానిక సౌందర్య రోడ్డు వరకు కోలాటం ప్రదర్శనతో భారీ ర్యాలీ చేశారు. తమపై సర్కారు నిర్లక్ష్యం వీడాలని, సమస్యలు పరిష్కరించాలని నినదించారు. రిటైర్మెంట్‌ వయసు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్‌సీ అమలు చేయాలని నినాదాలు చేశారు. షోకాజ్‌ నోటీసులు ఇచ్చి భయపెట్టే ధోరణి తగదన్నారు. గత ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని , తమపై కక్ష సాధింపులు మానుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 31 , 2023 | 12:30 AM