విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ABN , First Publish Date - 2023-09-22T00:04:10+05:30 IST

వసతి గృహ విద్యార్థుల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికా రి (డీఐవో) డాక్టర్‌ టి.జగన్మోహనరావు సిబ్బందిని సూచించారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

కొమరాడ: వసతి గృహ విద్యార్థుల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికా రి (డీఐవో) డాక్టర్‌ టి.జగన్మోహనరావు సిబ్బందిని సూచించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ గురుకులం, ఏపీ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం, గిరిజన సంక్షేమ బాలిక ల ఆశ్రమ పాఠశాలను వైద్య బృందంతో కలిసి ఆయన గురువారం సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య తనిఖీల వివరాలు, హిమోగ్లోబిన్‌ రక్తపరీక్షల వివరాలు, తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వివరాలను సంబంధిత యాప్‌లో నమోదు చేశారో లేదో పరిశీలించారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు ఆ లక్షణాలు ఎలా ఉంటాయో వివరించారు. అనంతరం ఆయన సిక్‌ రూములో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. వారికి అందజేస్తున్న చికిత్సను సిబ్బందిని అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ఆరోగ్య కార్యాలయ డెమో యోగేశ్వరరెడ్డి, ప్రిన్సిపాళ్లు జి.లక్ష్మి, డి.లక్ష్మణరావు, ఎం.ర మాదేవి, ఏఎన్‌ఎం దేవి, ఆశా కార్యకర్తలు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:04:10+05:30 IST