ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2023-05-26T00:00:51+05:30 IST
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ (ఏపీజీఈఏ) నాయకులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఒక్కరోజు నిరాహార దీక్ష శిబిరం నిర్వ హించారు.

పాలకొండ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ (ఏపీజీఈఏ) నాయకులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఒక్కరోజు నిరాహార దీక్ష శిబిరం నిర్వ హించారు. ముఖ్య సంధానకర్తగా నూతులపాటి భరత్‌భూషణ్‌రాజు మాట్లాడారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలన్నారు. కాంట్రా క్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని, తమ న్యాయ మైన కోర్కెలను పరిష్కరించాలన్నారు. ఈ నిరాహార దీక్షలో ఏపీజీఈఏ సంఘ నాయకులు ఎం.సింహాచలం, బి.జగదీశ్వరరావు, బబ్బురు గణేష్‌బాబు, రవీంద్రకు మార్, రమేష్‌నాయుడు, మదన్, జయకుమార్, బి.వి.రమణ, సూర్యనారాయణ, సంపత్‌కుమార్, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.