Share News

మూడో అంతస్తు నుంచిజారిపడి..

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:08 AM

నిర్మాణంలో ఉన్న ఇంటిపై నుంచి జారి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కొట్టక్కి గ్రామం సమీపంలో కొత్తగా ఒక అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు

మూడో అంతస్తు నుంచిజారిపడి..

రామభద్రపురం: నిర్మాణంలో ఉన్న ఇంటిపై నుంచి జారి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కొట్టక్కి గ్రామం సమీపంలో కొత్తగా ఒక అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులకు విజయనగరం మండలం గాజులరేగకు చెందిన బెల్లాన పైడిరాజు (58) హాజరువుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం పైడిరాజు నిర్మాణ పనుల్లో ఉండగా సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అపార్టుమెంట్‌లోని 3 వ అంతస్తుపైనుంచి ప్రమాదవ శాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో పైడిరాజు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108లో విజయనగరం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పైడిరాజు భార్య బెల్లాన కుమారి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ బి.సురేంద్రనాయుడు తెలిపారు.

Updated Date - Dec 29 , 2023 | 12:09 AM