జనవరి 23న సిరిమానోత్సవం
ABN , First Publish Date - 2023-11-19T23:34:33+05:30 IST
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవం, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. ఆదివారం చదురుగుడి ఆవరణలో ఈవో వీవీ సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జాతర తేదీలను ప్రకటించారు.

మక్కువ: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవం, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. ఆదివారం చదురుగుడి ఆవరణలో ఈవో వీవీ సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జాతర తేదీలను ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 22న తొలేళ్లు, 23న సిరిమానోత్సవం, 24న అనుపోత్సవం, 30న మారుజాతర నిర్వహించడానికి పెద్దలు నిర్ణయించారు. డిసెంబరు 18న పెదపోలమాంబ అమ్మవారి సనప సాటింపుతో జాతరలో ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. పోలమాంబ జాతర రాష్ట్ర పండగ్గా గుర్తించడంతో ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు తీర్మానించారు. కాగా ఈ జాతర పది వారాల పాటు జాతర జరగనుంది. ఈ సమావేశంలో ట్రస్టు బోర్డు చైర్మన్ పూడి దాలినాయుడు, ఎంపీటీసీ పోలినాయుడు, కమిటీ సభ్యులు, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.