నిస్వార్థంగా సేవలందించడం అభినందనీయం
ABN , First Publish Date - 2023-09-23T00:13:54+05:30 IST
ప్రస్తుతం వీధికో స్వచ్ఛంద సంస్థ పుట్టుకొస్తోందని, వాటిలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వి చాలా తక్కువ అని పోలీసు సూపరింటెండెంట్ ఎం.దీపికా పాటిల్ అన్నారు. శుక్రవారం మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టు 25వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
కొత్తవలస, సెప్టెంబరు 22: ప్రస్తుతం వీధికో స్వచ్ఛంద సంస్థ పుట్టుకొస్తోందని, వాటిలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వి చాలా తక్కువ అని పోలీసు సూపరింటెండెంట్ ఎం.దీపికా పాటిల్ అన్నారు. శుక్రవారం మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టు 25వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. 25 సంవత్సరాలుగా నిస్వార్దంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందిస్తూ సేవా కార్యక్రమాలను గురుదేవ చారిటబుల్ అందించడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల వరకు కృత్రిమ అవయవాలను అందించినట్టు తెలుసుకుని ట్రస్టు వ్యవస్థాపకుడు రాపర్తి జగదీష్ బాబును కొనియాడారు. గురుదేవ ఆసుపత్రిని సందర్శించి, అనంతరం దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. స్వయం ఉపాధి పఽథకం కింద దివ్యాంగులకు అంద చేసిన పాన్‌షాప్‌ను ఆమె ప్రారంభించారు. ట్రస్టు వ్యవస్థాపకుడు జగదీష్ బాబు, కొత్తవలస సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ బి.దేవి, గురుదేవ ట్రస్టు వైస్ చైర్మన్ ఫణీంద్ర, ఆసుపత్రి సీఈవో అచ్యుత రామయ్య, వైద్యులు రాఘవేంద్ర, సుజాత, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ దీపికా పాటిల్ కొత్తవలస పోలీసుస్టేషన్‌ను శుక్రవారం సందర్శించారు. పోలీసు స్టేషన్‌లోని ఎస్‌ఐలు, సీఐ, ఇతర సిబ్బంది ఉండే అన్ని గదులను పరిశీలించిన అనంతరం స్టేషన్ వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసు స్టేషన్‌కు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు.