Share News

సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:43 AM

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీ సేందుకు వైజ్ఞానిక ప్రద ర్శనలు ఎంతగానో ఉప యోగపడతా యని జేసీ ఆర్‌.గోవిందరావు అన్నారు.

సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు

బెలగాం: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీ సేందుకు వైజ్ఞానిక ప్రద ర్శనలు ఎంతగానో ఉప యోగపడతా యని జేసీ ఆర్‌.గోవిందరావు అన్నారు. శనివా రం స్థానిక డీవీఎం పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానికి ప్రదర్శనలకు ముఖ్య అతిథిగా జేసీ హాజరయ్యారు. వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు సృజనాత్మకత వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోను గౌరీశ్వరి, అధికారులు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:43 AM