సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2023-06-26T00:23:59+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ బుధవారం కురుపాం రానున్న నేపథ్యంలో ఆదివారం టూర్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.
పార్వతీపురం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్ బుధవారం కురుపాం రానున్న నేపథ్యంలో ఆదివారం టూర్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ మేరకు 28న ఉదయం 10 గంటలకు చినమేరంగి చేరుకుని ఆయన చేరుకుంటారు. అక్కడ 10.15 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు. 10.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 12.15 గంటలకు సభా ప్రాంగణం నుంచి బయలుదేరి చినమేరంగిలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12.55 గంటలకు స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం ఒంటిగంటకు హెలీకాఫ్టర్‌లో విశాఖకు బయలుదేరనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
కురుపాం, జూన్25: సీఎం పర్యటన నేపథ్యంలో కురుపాంలో ఏర్పాట్లను ఆదివారం డిప్యూటీ సీఎం రాజన్నదొర, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఏర్పాట్లన్నీ పక్కాగా చేయాలన్నారు. రూ. 150 కోట్లతో కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిశీలనలో జేసీ గోవిందరావు, ఐటీడీఏ పీవోలు విష్ణుచరణ్, కల్పనాకుమారి, డీఆర్వో వెంకటరావు, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, వైసీపీ నేత పరీక్షిత్ రాజు పాల్గొన్నారు.