Share News

సంకల్ప దీక్ష

ABN , First Publish Date - 2023-11-20T00:13:42+05:30 IST

విద్యారంగ సమస్యలకు పరిష్కారం కోరుతూ కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు మూడో రోజు కూడా కొనసాగాయి. దీక్షకు ఆదివారం యూటీఎఫ్‌ మహిళా విభాగం నాయకురాలు కె.విజయగౌరి మద్దతు తెలిపారు.

సంకల్ప దీక్ష
నినాదాలు చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, యూటీఎఫ్‌ ప్రతినిధులు

సంకల్ప దీక్ష

కొనసాగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నిరవధిక నిరాహార దీక్ష

కలెక్టరేట్‌, నవంబరు 19: విద్యారంగ సమస్యలకు పరిష్కారం కోరుతూ కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు మూడో రోజు కూడా కొనసాగాయి. దీక్షకు ఆదివారం యూటీఎఫ్‌ మహిళా విభాగం నాయకురాలు కె.విజయగౌరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల విద్యా రంగం పూర్తిగా నాశనమైందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎన్‌ఈపీ పేరుతో స్కూల్స్‌ మూసివేశారని, 2021లో పూర్తి కావాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం ఇప్పటి భవన నిర్మాణం మొదలు కాలేదన్నారు. వసతి గృహాల్లో చదువుతున్న బాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యా రంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెంకటేష్‌, రామ్మోహన్‌ మాట్లాడుతూ దీక్ష బృందం సభ్యుల ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణించినా సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ పోరాటం చేస్తామన్నారు. తమ ఆందోళన తీవ్రతరం అవుతుందని, దీనికి విద్యా శాఖ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో కూర్చుకున్న వారికి ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు.

Updated Date - 2023-11-20T00:13:45+05:30 IST