సడలని దీక్ష

ABN , First Publish Date - 2023-09-25T23:58:10+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జిల్లాలో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

 సడలని దీక్ష
మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేస్తున్న టీడీపీ నేతలు

సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు

పార్వతీపురం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జిల్లాలో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు సోమవారం సీతానగరం మండలం లచ్చయ్యపేట షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబును విడుదల చేసే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. సీతంపేటలో సంతలో ప్రజలకు పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ కరపత్రాలను పంపిణీ చేశారు. కురుపాంలో నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Updated Date - 2023-09-25T23:58:10+05:30 IST