రోడ్డు ట్యాక్స్ తప్పనిసరిగా చెల్లించాలి
ABN , First Publish Date - 2023-10-13T00:16:24+05:30 IST
కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలలో గురువారం వాహనాలు తనిఖీ ప్రత్యేక డైవ్ నిర్వహించి రోడ్డు ట్యాక్స్ చెల్లిం చని వాహనాలకు, అధిక ప్యాసింజర్లతో ప్రయాణిస్తున్న వాహనాలకు రూ.లక్ష 63వేలు పెనాల్టీ విధించామని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్, సత్యనారాయణ తెలియజేశారు.
కురుపాం: కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలలో గురువారం వాహనాలు తనిఖీ ప్రత్యేక డైవ్ నిర్వహించి రోడ్డు ట్యాక్స్ చెల్లిం చని వాహనాలకు, అధిక ప్యాసింజర్లతో ప్రయాణిస్తున్న వాహనాలకు రూ.లక్ష 63వేలు పెనాల్టీ విధించామని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్, సత్యనారాయణ తెలియజేశారు. ఈసందర్భంగా వారు విలేకర్లతో మాట్లా డుతూ జిల్లా ఆర్టీవో మల్లికార్జున్‌రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించి వాహనదారులకు వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ తప్పనిసరిగా కలిగిఉండాలని, సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని తెలిపారు.