Share News

తొట్లకొండ వద్ద రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:20 AM

భీమిలి బీచ్‌రోడ్డు తొట్లకొండ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో విజయనగరానికి చెందిన ఇద్దరు యువకులు తీవ్రగాయాలయ్యాయి. విజయనగరానికి చెందిన అరవింద్‌, దుర్గాప్రసాద్‌ ద్విచ క్ర వాహనంపై భీమిలి బీచ్‌రోడ్డులో విశాఖ వెళ్తున్నారు. తొట్లకొండ సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న కారును వీరు బలంగా ఢీకొన్నారు.

తొట్లకొండ వద్ద రోడ్డు ప్రమాదం

భీమునిపట్నం: భీమిలి బీచ్‌రోడ్డు తొట్లకొండ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో విజయనగరానికి చెందిన ఇద్దరు యువకులు తీవ్రగాయాలయ్యాయి. విజయనగరానికి చెందిన అరవింద్‌, దుర్గాప్రసాద్‌ ద్విచ క్ర వాహనంపై భీమిలి బీచ్‌రోడ్డులో విశాఖ వెళ్తున్నారు. తొట్లకొండ సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న కారును వీరు బలంగా ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలకు గురయ్యారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కాగా చేపలతిమ్మాపురం వద్ద కల్వర్టు శిథిల స్థితికి చేరడంతో అటు వైపు వాహన రాకపోకలను నిలిపివేసి, సింగిల్‌ లైన్‌లోకి మళ్లించారు. దీంతో ఎదురెదురుగా వాహనాలు రావడంతో ప్రమాదం సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమచారం తమకు అందలేదని భీమిలి పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 14 , 2023 | 12:20 AM