పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టంపై సమీక్ష
ABN , First Publish Date - 2023-08-04T00:20:28+05:30 IST
స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గురువారం పీసీ అండ్ పీఎన్‌డీటీ (లింగ నిర్ధారిత పరీక్షల నిరోధ) చట్టంపై ఆర్డీవో పి.శేషశైలజ సమీ క్షించారు. పురుష సంతాన ప్రాధా న్యం, ఆడపిల్లలపై వివక్షత, మూఢ నమ్మకాలు వంటి సామాజిక అంశా ల్లో ప్రజలకు చైతన్యం కలిగించాలని ఆమె అన్నారు.
బొబ్బిలి, ఆగస్టు 3: స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గురువారం పీసీ అండ్ పీఎన్‌డీటీ (లింగ నిర్ధారిత పరీక్షల నిరోధ) చట్టంపై ఆర్డీవో పి.శేషశైలజ సమీ క్షించారు. పురుష సంతాన ప్రాధా న్యం, ఆడపిల్లలపై వివక్షత, మూఢ నమ్మకాలు వంటి సామాజిక అంశా ల్లో ప్రజలకు చైతన్యం కలిగించాలని ఆమె అన్నారు. లింగనిర్ధారణ జరిపి, ఆడపిల్ల అని తెలిస్తే గర్భ స్రావం చేసుకోవడాన్ని పూర్తిగా నిరోధించాలని, అలాంటి చర్యల కు పాల్పడిన వారందరినీ చట్టపరంగా శిక్షించాలన్నారు. 0-6 సంవత్సరాల బాలిక ల లింగ నిష్పత్తిని పెంచడానికి ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. డివిజన్ పరిధిలో గల వైద్యాధికారులు, పోలీసులు అప్రమత్తంగా మెలిగి ఈ చట్టా న్ని పగడ్బందీగా అమలు చేయాలని ఆర్డీవో కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ జి.సంతోషికుమారి, ఐసీడీఎస్ సూపర్‌వైజరు చి న్నతల్లి, డీఈఎంవో చాముండేశ్వరి, పవన్ ఆశీష్ తదితరులు పాల్గొన్నారు.