ఓటర్ల జాబితాలో లోపాలను తెలియజేయండి
ABN , First Publish Date - 2023-11-22T00:16:27+05:30 IST
ఓటర్ల జాబితాలో గుర్తించిన లోపాలను తమ దృష్టికి తీసుకు రావాలని ఆర్డీవో బొడ్డేపల్లి శాంతి రాజకీ య నాయకులను కోరారు.

చీపురుపల్లి: ఓటర్ల జాబితాలో గుర్తించిన లోపాలను తమ దృష్టికి తీసుకు రావాలని ఆర్డీవో బొడ్డేపల్లి శాంతి రాజకీ య నాయకులను కోరారు. ఓటర్ల జాబితాలోని లోపాలపై ఆమె మంగళవారం చీపురుపల్లిలోని తన కార్యాలయంలో రాజకీయ నాయకులతో సమావేశం నిర్వ హించారు. ఓటర్ల జాబితాలోని లోపాలను సవరించేందుకు తమకు సహక రిం చాలని కోరారు. అనంతరం, పట్టణంలోని అన్ని కళాశాల ప్రిన్సిపాల్స్‌తో మా ట్లాడారు. 18 ఏళ్లు నిండినవారిని ఓటర్లుగా నమోదు చేయించడంలో చొరవ చూపించాలన్నారు. ఈ సమావేశంలో ఏఈఆర్వోలు ఎం.సురేష్, తాడ్డి గోవింద రావు, విజయభాస్కర్, టీడీపీ నాయకుడు తాడ్డి సన్యాసినాయుడు, జనసేన నాయకుడు వి.శ్రీనివాసరావు, పట్టణంలోని కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.