రిమాండ్ ఖైదీ పరారీ
ABN , First Publish Date - 2023-11-22T00:15:12+05:30 IST
ర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన రిమాండ్ ఖైదీ ఎస్కార్టు పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన విజయనగరంలో మంగళవారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రిమాండ్ ఖైదీ పరారీ
విజయనగరం క్రైం, నవంబరు 21: కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన రిమాండ్ ఖైదీ ఎస్కార్టు పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన విజయనగరంలో మంగళవారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లా నూకరాజు అనకాపల్లి జిల్లాలోని ఎస్.రాయవరం, ఎలమంచిలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో రిమాండ్ ఖైదీగా విశాఖ జైలులో ఉంటున్నాడు. ఈ ఏడాది విజయనగరం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు దొంగతనం కేసుల్లోనూ నిందితునిగా ఉన్నాడు. దీనిపై టూటౌన్ పోలీసులు కోర్టులో కేసు వేశారు. విచారణ కోసం మంగళవారం విశాఖ సెంట్రల్ జైలునుంచి ఎస్కార్ట్ పోలీసులు విజయనగరం కోర్టుకు తీసుకొచ్చారు. వచ్చే నెల 4వ తేదీకి కేసు వాయిదా పడింది. అనంతరం ఎస్కార్ట్ పోలీసులు భోజనం కోసం హోటల్‌కు వెళ్లారు. చేయి కడుక్కొని వస్తానని చెప్పిన నూకరాజు రెండో కంటికి కనిపించకుండా బయటకు వెళ్లిపోయాడు. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఇదే కేసులో నూకరాజుతో పాటు మరో ఇద్దరు ఖైదీలు, ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక కేసులో నిందితులుగా ఉన్నారు. మరో నిందితుడిని కూడా కోర్టుకు తీసుకొచ్చారు. మొత్తం నలుగురు నిందితుల్లో ఒకరు పరారయ్యాడు. దీనిపై టూటౌన్ ఎస్‌ఐ షేక్‌శంకర్‌ని వివరణ అడగ్గా పరారైన ఖైదీ నూకరాజు గురించి ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఎస్కార్ట్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి కేసు నమోదు చేస్తామన్నారు.
--------