సహకార బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు

ABN , First Publish Date - 2023-03-31T00:03:36+05:30 IST

విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉద్యోగ నియామకాల కోసం చర్యలు చేపడుతున్నారు.

సహకార బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉద్యోగ నియామకాల కోసం చర్యలు చేపడుతున్నారు. డీసీసీబీలో ఆరు మేనేజర్‌ పోస్టులు, 20 అసిస్టెంట్‌ మేనేజర్లు, 32 క్లర్కులు, స్టాఫ్‌ అసిస్టెంట్లను భర్తీ కి నోటిఫికేషన్‌ విడుదలైంది. మేనేజర్‌ పోస్టుల్లో ఓసీ కేటగిరీలో జనరల్‌ 2, మహిళ 1, బీసీ-ఏలో మహిళ 1, ఎస్సీ మహిళ 1, పీహెచ్‌సీ మహిళ 1 పోస్టు ఉన్నాయి. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల్లో ఓసీలో మహిళ 5, బీసీ-ఎలో జనరల్‌ 2, బీసీ-బిలో జనరల్‌ 2, మహిళ 1, బీసీ-సీలో జనరల్‌ 1, బీసీడీ మహిళ 1, బీసీ-ఈలో మహిళ 1, ఎస్సీ జనరల్‌ 2, మహిళ 1, ఎస్టీ జనరల్‌ 2, పీహెచ్‌సీ మహిళ 1, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ జనరల్‌ 1 పోస్టు ఖాళీ ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం 30.3.2023, దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్‌ 15 కాగా, పరీక్ష మే లేదా జూన్‌లో నిర్వహిస్తారు. విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

Updated Date - 2023-03-31T00:03:36+05:30 IST