భగవద్గీత పఠిస్తే నిత్యం ఆనందమే
ABN , First Publish Date - 2023-09-23T00:09:52+05:30 IST
ప్రతిరోజూ యువత భగవద్గీత పఠి స్తే మీ జీవితం ఆనంద కరంగా ఉంటుందని, ప్రతిఒక్కరూ మాంసా హారం విడిచి పెట్టాలని తిరుమల తిరు పతి ఇస్కాన్ టెంపుల్ సనాతనధర్మం ప్రచారకర్త రాధామనోహర్ దాస్ అన్నారు.
శృంగవరపుకోట రూరల్: ప్రతిరోజూ యువత భగవద్గీత పఠి స్తే మీ జీవితం ఆనంద కరంగా ఉంటుందని, ప్రతిఒక్కరూ మాంసా హారం విడిచి పెట్టాలని తిరుమల తిరు పతి ఇస్కాన్ టెంపుల్ సనాతనధర్మం ప్రచారకర్త రాధామనోహర్ దాస్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని రాజీపేట శంబలనగరి ఆశ్ర మాన్ని దర్శించారు. అనంతరం అక్కడ ఉన్న విద్యార్థులు, గ్రామస్థులతో మాట్లాడు తూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయా లని సూచించారు. ప్రభుత్వాలు హిందూధర్మ రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆశ్రమంలో గోపూజ నిర్వహించారు.