Share News

ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:04 AM

వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఓటరు జాబితాపై క్లయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించ నున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు.

 ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఓటరు జాబితాపై క్లయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించ నున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 22వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారు. ఇప్పటివరకు ఫారం-6లు 42,362 , ఫారం-7లు 46,094, ఫారం-8లు 97,227 చొప్పున పత్రాలు అందాయన్నారు. జిల్లాలోఓట్లు కలిగి ఉన్న వారికి ఇతర ఇతర ప్రాంతాల్లోనూ ఓటు హక్కు ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్వో జె.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:04 AM