Share News

దుర్మార్గ పాలనకు చరమగీతం పలకండి

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:43 PM

వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపాలనకు చరమగీతం పలకాలని తెలుగు దేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే జరిగే నష్టాలను ఇంటింటికి వెళ్లి వివరించి కరపత్రాలను అందజేశారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు.

 దుర్మార్గ పాలనకు చరమగీతం పలకండి
శృంగవరపుకోట: బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కోళ్ల లలితకుమారి ::

వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపాలనకు చరమగీతం పలకాలని తెలుగు దేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే జరిగే నష్టాలను ఇంటింటికి వెళ్లి వివరించి కరపత్రాలను అందజేశారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు.

సాలూరు: రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. సాలూరు పట్టణంలోని 4, 5 వార్డుల్లో బా బు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌, పార్టీ పట్టణ అధ్యక్షు డు నిమ్మాది తిరుపతిరావు, బొత్స ఈశ్వరరావు, కనకారావు పాల్గొన్నారు.

పాలకొండ: ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ రిజిస్ర్టేషన్‌ పూర్తి చేయాలని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ కోరారు. వెలగవాడ, కొండాపురం, భాసూరు, ఎం.సింగుపురం, పొట్లిల్లో పర్యటించారు. కార్యక్రమంలో గండి రామినాయుడు, శాసపు సుగుణాకర్‌, కరణం నారాయణరావు, రాయి రామకృష్ణ, మీసాల అక్కలనాయుడు, మీసాల శ్రీను, కోట సంగంనాయుడు, కిమిడి బంగారునాయుడు, కీర్తి నారాయణరావు పాల్గొన్నారు. ఫ శృంగవరపుకోట: ఎస్‌.కోట మునసబ్‌ వీధిలో బాబుష్యూరిటి-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్‌ చార్జి కోళ్ల లలితకుమారి నిర్వహించారు. కార్యక్రమంలో మోపాడ చిన్ని కృష్ణ, కొణదం మల్లేశ్వరరావు, నానిగిరి రమనాజీ, జీఎస్‌ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:43 PM