సమస్యలకు పరిష్కారం చూపాలి: జేసీ
ABN , First Publish Date - 2023-11-21T00:16:26+05:30 IST
:జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలకు అధికారులు సంతృప్తికర పరిష్కారం చూపాలని జేసీ ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్ట రేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ కేశవనాయుడుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు పలుసామాజిక, వ్యక్తిగత అంశాలపై 152 అర్జీలు అందించారు. సాలూరు మండలం జిగిరాం గ్రామానికి చెందిన కుబిరెడ్డి రామారావుకు జేసీ గోవిందరావు వినికిడి యం త్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాథరావు, జిల్లా నీటియాజమాన్య సంస్థ డైరెక్టర్ రామచంద్రరావు పాల్గొన్నారు.

పార్వతీపురం ఆంధ్రజ్యోతి:జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలకు అధికారులు సంతృప్తికర పరిష్కారం చూపాలని జేసీ ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్ట రేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ కేశవనాయుడుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు పలుసామాజిక, వ్యక్తిగత అంశాలపై 152 అర్జీలు అందించారు. సాలూరు మండలం జిగిరాం గ్రామానికి చెందిన కుబిరెడ్డి రామారావుకు జేసీ గోవిందరావు వినికిడి యం త్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాథరావు, జిల్లా నీటియాజమాన్య సంస్థ డైరెక్టర్ రామచంద్రరావు పాల్గొన్నారు.