పరీక్షలకు సన్నద్ధం

ABN , First Publish Date - 2023-03-05T00:11:04+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవు తున్నాయి.

పరీక్షలకు సన్నద్ధం
నాగూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్‌ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎంఈవో నాగభూషణరావు

మూడు నుంచి తొమ్మిది తరగతులకు ఎఫ్‌ఏ-4

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

(గరుగుబిల్లి)

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవు తున్నాయి. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి మూడు నుంచి తొమ్మిది తరగతుల వారికి ఎఫ్‌ఏ-4, టెన్త్‌ విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఏయే తేదీల్లో ఏ పరీక్షలంటే..

- ప్రాథమిక స్థాయిలో 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థులకు 9న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఓఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తారు. 10న తెలుగు, గణితం, 14న ఇంగ్లీషు, పరిసరాల విజ్ఞానం పరీక్షలు నిర్వహించనున్నారు.

- 6, 7, 8 తరగతులకు సంబంధించి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. 9న ఓఎస్‌ఎస్‌సీ 1, 2, 10న తెలుగు, గణితం, 14న హిందీ, జనరల్‌ సైన్స్‌, 15, ఇంగ్లీషు, సోషన్‌ పరీక్షలు జరగనున్నాయి.

- 9వ తరగతికి సంబంధించి ఉదయం 9.30 గంటల నుంచి 11.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 9న బీఎస్‌ఎస్‌పీ, 10న తెలుగు, గణితం, 14న హిందీ, జనరల్‌ సైన్స్‌, 15న ఇంగ్లీషు, సోషల్‌ పరీక్షలు జరగనున్నాయి.

- 10వ తరగతికి సంబంధించి విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 9న ప్రఽథమ భాష, కాంపోజిట్‌ కోర్సు పేపరు-1, 10న ద్వితీయ భాష, 14న ఇంగ్లీషు, 15న గణితం, 16న సైన్స్‌, 17న సోషల్‌, 18న కాంపోజిట్‌ కోర్సు పేపరు-2, బీఎస్‌ఎస్‌సీ మెయిన్‌ పేపరు-1, 20న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజీ పేపరు-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

15 నుంచి ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు..

జిల్లాలోని ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఈనెల 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డిగ్రీకి సంబంధించి 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 15 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు 5వ సెమిస్టర్‌ , మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 3వ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహణ జరగనున్నాయి. 15న ఇంటర్‌ ప్రఽథమ సంవత్సరం, 16వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్‌కు సంబంధించి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా మార్చి పరీక్షా నెలగా మారింది.

ఏర్పాట్లు చేస్తున్నాం..

జిల్లా పరిధిలోని 1700 పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు నుంచి తొమ్మిది తరగతుల వారికి ఎఫ్‌ఏ4, టెన్త్‌ విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నాం. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని ఆయా పాటశాలల సిబ్బందిని ఆదేశించాం

- ఎస్‌డీవీ రమణ, డీఈవో

Updated Date - 2023-03-05T00:11:04+05:30 IST