డప్పులు వాయించి.. ఆలపించి..
ABN , Publish Date - Dec 31 , 2023 | 11:06 PM
తమ సమస్యలపై సర్కారు స్పందించాలని సమగ్ర శిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు నినదించారు. ఆదివారం కలెక్టరేట్ వద్ద శిబిరంలో డప్పులు వాయించి.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలపించి వినూత్నంగా నిరసన తెలిపారు.
బెలగాం, డిసెంబరు 31: తమ సమస్యలపై సర్కారు స్పందించాలని సమగ్ర శిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు నినదించారు. ఆదివారం కలెక్టరేట్ వద్ద శిబిరంలో డప్పులు వాయించి.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలపించి వినూత్నంగా నిరసన తెలిపారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, కక్షపూరిత చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఒకటో తేదీన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్‌సీ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘ నాయకులు పాల్గొన్నారు.