Share News

భూ సమస్యలపై వినతులు

ABN , First Publish Date - 2023-11-21T00:07:35+05:30 IST

కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో భూ సమస్యలపై అధికంగా వినతులు వచ్చాయి. రీసర్వే జరిగిన గ్రామాల్లో హద్దుల నిర్ధారణలో లోపాలపై, జాయింట్‌ పట్టాల విషయంలో సమస్యలపై, గతంలో ఉన్న విస్తీర్ణం సర్వే జరిగిన తరువాత విస్తీర్ణం తేడా వస్తుందని, మీసేవ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఒరిజనల్‌ 1బీలు, ఆడంగల్‌ మంజూరు కావడం లేదని అర్జీదారులు విన్నవించారు

భూ సమస్యలపై వినతులు

కలెక్టరేట్‌, నవంబరు 20: కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో భూ సమస్యలపై అధికంగా వినతులు వచ్చాయి. రీసర్వే జరిగిన గ్రామాల్లో హద్దుల నిర్ధారణలో లోపాలపై, జాయింట్‌ పట్టాల విషయంలో సమస్యలపై, గతంలో ఉన్న విస్తీర్ణం సర్వే జరిగిన తరువాత విస్తీర్ణం తేడా వస్తుందని, మీసేవ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఒరిజనల్‌ 1బీలు, ఆడంగల్‌ మంజూరు కావడం లేదని అర్జీదారులు విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 241 వినతులు అందగా, ఇందులో రెవెన్యూకు సంబంధించి 173 ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాల సమస్యలపై 25, పంచాయతీ రాజ్‌కు 10, మున్సిపల్‌ కార్పొరేషన్‌, వైద్య ఆరోగ్య శాఖకు కలిసి 7 వినతులు వచ్చాయి. వీటిని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డీఆర్‌వో ఎస్‌డీ అనిత, రెవెన్యూ డివిజన్‌ అధికారి సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్లు బి.సుదర్శన దొర, సుమబాల తదితరులు స్వీకరించారు. ఫ గంట్యాడ మండలంలోని కొత్తవెలగాడ గ్రా మంలోని 60 మంది దళిత కుటుంబాలకు 1976లో 150 ఎకరాలు డి.పట్టా భూములు పంపిణీ చేశారు. ఇప్పటి వరకూ వారికి సంపూర్ణ హక్కు కల్పించలేదు. ఆయా భూ ముల్లో మామిడి, జీడి మొక్కలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదు చేయలేదు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ సెల్‌ నాయకులు పీరుబండి జై హింద్‌ కుమార్‌ స్పందన లో వినతి పత్రం ఇచ్చారు.

విజయనగరం (ఆంధ్రజ్యో తి): టీడీపీ హయాంలో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను కబ్జా చేసి అమ్మేయాలని చూస్తున్నార ని...రాజకీయ నాయకులకు అధికా రం శాశ్వతం కాదని, దౌర్జన్యాలకు దిగితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని సీనియర్‌ నేత ఈగల సత్తిబాబు అధికార పార్టీ నేతలను హెచ్చ రించారు. విజ యనగరం మండలం గొళ్లలపేట గ్రామంలో సుమారు 45 మందికి ప ట్టాలు ఇచ్చారని, స్థానిక నేత వాటిని కబ్జా చేసి విక్రయిస్తున్నారని ఆరోపించారు. వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళలతో కలసి సోమవా రం కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో జేసీ మయూర్‌ అశోక్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన స్టేను కూడా జేసీకి చూపించారు. దీంతో స్థానిక తహశీల్దార్‌ కోరాడ శ్రీనివాసరావును పిలిపించి క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తి వివరాలను తనకు నివేదించాలని జేసీ ఆదే శించారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు బొద్దల నర్సింగరావు మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాలను ఆక్రమించడం అన్యాయమని... రెవెన్యూ, పోలీసు అధికారులు పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకోవాలని

Updated Date - 2023-11-21T00:07:37+05:30 IST